యుద్ధం నరమేధం..
సిద్ధం కమ్మంటూ...
ముందుకు తోసిందా ..
దేశపు ఆదేశం...
సరిహద్దుల కంచెలలో..
చిందెను ఆ-కలి రక్తం..
గీతల చెరలలో ..
చెదిరెను ఆఖరి స్వప్నం..
ఆదాయం కొఱకై..
దాయాదుల ఆరాటం..
ఆ దమ్ముల గొడవలలో..
మిగులుతుంది అఖాతం..
మతం మకిలి ముసుగులలో..
వెకిలి ద్వేషం ఎగిసింది..
ఆ దేశపు వాడంటే..
ఈసదింపె కలిగింది..
గెలుపోటములు తేల్చేది ..
నెత్తుటి మాంసపు ముద్దలా?
సమస్యలన్నిటి విరుగుడు..
సంహారపు మనిహారమా?