తెలవారేనా ఇప్పటికి..
కళ్ళు చుక్కల రాత్రిని పరికిస్తున్నాయి..
సూచన కోసం
అంధకారం వెలుగులో కరిగే వేళకై..
తేజోవంత సూర్యుని రాక తో..
ఎందరి స్వప్నాలో మేల్కొన్నాయి..
కళ్లు కానుక స్వీకరిస్తున్నాయి..
ఆ పేరు వినటానికి..
అది ఎప్పటికి ఆమె ఆత్మలో ఒదిగిపోతుంది!
- కృష్ణ కావ్య
అనువాదం : శరత్చంద్ర