నా లోపల ఏ మూలో పగిలిన
అంతుచిక్కని మనసుతో ఎదురోడుతున్నా..
ఓడిపోయానని ప్రతీసారీ అనుకుంటున్నా!
ఎవ్వరూ వెళ్ళని బాటలో నే పయనిస్తున్నా...
అక్కడి రహస్యాలు ఆశ్చర్యపరుస్తూనే..
నాలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి!
నే సంధ్య కు లొంగుతూనే..
వేకువ తో ఓపిక ఒప్పందం చేస్తున్నా!
నేన్ బాహ్యమైన అందంతో పోటీ పడలేకున్నా..
లోపలి వైభవానికి రారాణి ని!
కావున ,కొన్ని మాటలు నను నొప్పించనిస్తున్నా!
ఎంతైనా అంతర్లీనంగా ..
నేనే శక్తి ప్రదాయనిని!!
. . . కృష్ణ కావ్య
అనువాదం : శరత్చంద్ర