మూసిన తలుపుల
లోపల ముగిసెను ఓ ప్రాణం!!
సూర్యుని రాకతో
మసిగా మారెను ఓ ప్రాణం!!
వెంబడే రాబందుల
వేటకు ఒరిగెను ఓ ప్రాణం!!
సారపు భూమి లో
కూరుకు పోయెను ఓ ప్రాణం!!
కురిసే వర్షములోనూ
కాలిపోయెను ఓ ప్రాణం!!
కపటపు నవ్వులలో
నలిగెను ఓ ప్రాణం!!
అణచిన దేవుడే
మరచిన ఓ ప్రాణం!!
తనువుకు చావును
తెచ్చేటి ఓ ప్రాణం!!
ఎవరూ..??
నేను ..ఎవరూ??..
ఎవరూ..??
నేను.. ఎవరూ??..
నువ్వు వెలుగు..
మరి నేను.. ఎవరు?
నువ్వు వర్షం
మరి నేను.. ఎవరు?
ఓ.. ఎవరూ..? ఎవరూ...?
రైలు వెతికి వచ్చి చచ్చిపడిన..
నేను ఎవరు?
పూల చెట్టుకు వేలబడుతున్న..
నేను ఎవరు?
నదిలో చచ్చిన మీనులా తేలుతున్న..
నేను ఎవరు?
కుమ్మరి గుడిసెలో కాలిపోతున్న..
నేను ఎవరు?
సామి రథాలు చేరువకాని..
నేను ఎవరు?
మీరు ముట్టని నీరు తాగే
నేను ఎవరు?
ఊరు గోడకు నెట్టబడిన..
నేను ఎవరు?
మీ మలాల గుంట లో శ్వాస విడిచిన..
నేను ఎవరు?
నాదే ఏలుబడి అని చెప్పారు..
నేను బానిసను అనీ అనుకున్నారు
దుక్కి దున్నిన చేతులు
పోరు చేసే చేతులవునా?
చావు లోనూ.. నీలంగా మారుతున్న
నేను ఎవరు?
పూడిస్తే ..నీలసంద్రంలో తేలుతున్న
నేను ఎవరు?
చావు లోనూ ..నీలంగా మారుతున్న
నేను ఎవరు?
పూడిస్తే ..నీలసంద్రంలో తేలుతున్న
నేను ఎవరు?
అనువాద మూలం : "నాన్ యార్" పాట
చిత్రం : పరియేరుం పెరుమాళ్ బీ.ఏ. బీ.ఎల్ (తమిళం 2018)