ఏమి తోచని వేళ..
అంతరంగ తరంగ ఊయల..
వేదిక పై ఊగిసలాడుతున్న
ఖాళీ చింతన లో చెదిరిన
అకాల జ్ఞాపకాల పుటలను
తడిమి తెరిచి ..
వలచి వగచి..
తొలచి తరించి..
స్మృతి సమాధి పై
మన్ను పోసి ముగిస్తిని..