మనిషి:
అర్ధిస్తేనో ఆరాధిస్తేనో ఆదరించేది మనిషి
అరిస్తేనో ఆక్షేపిస్తేనో చీదరించేది మనిషే
మలినాలు మరణాల జీవజాలం మనిషి
దైవం:
నమ్మకాల పెంపకాల్లో చిగురించిన దేవుడు
భయాలభయాల నడుమ కీర్తి గడించిన దేవుడు
ఊహాజనిత క్రియాప్రక్రియల రూపం ధరించిన దేవుడు
జీవుని ఆరాటం - దేవుని పోరాటం:
జీవుడు దేవుడు ల మధ్య సాగే పోరాటంలో
నిరంకుశంగా నెగ్గేది దేవుడే నలిగేది జీవుడే
ఎందుకంటే దేవుడి ఉనికే జీవుడి ఆరాటంలో
ఇంద్రియ నిగ్రహం లేని అసమర్థుడు
ఇంద్రాది విగ్రహ విరాట స్వరూపాలే
యజమానులు గా భావించి సేవిస్తాడు
తన బానిస భావజాలంలో బతుకీడుస్తాడు