ఆమె:
ఏదో మాయే నిన్నే చూపిందా! నాలో హాయే నేడే రేగిందా!!
అడుగే కదిలే నీవైపే.. ఏవైందో ఈ వేళా!
విసుగే రాని జల్లే లోలోన కురిసిందే
నన్నే కమ్మేసిన మేఘానివి నీ వేనా!!
అతడు:
పద పద పదమని మనసిలా..
జతపడమని అడిగెలె ఇపుడిలా..
మన కథ పథమని తెలిసెలే..
ఒకటవమని ఒరవడి కోరిందిలా..
ఆమె:
తడిసిన మనసుని ..తడిపిన మనిషిని
తనువుగా కోరతా.. అనువుగా అలుగుతా..
లతనై నేరుగా తననే చేరుతా
మదినే తాకుతా.. తనుగా మారుతా..
అతడు:
కాలం ఖర్చు చేసి .. కట్టేస్తా ఓ కోటా..
కలలా సామ్రాజ్యం లో.. నా రాణి నువ్వేనటా!
ఖండాల అందాలు నేసి..పెట్టిస్తే ఓ పూట..
ఆనందాల హరివిల్లు ..నీ నవ్వై పూచేనటా!!
ఆమె:
నా కంటు నీవుంటే ...నీ కౌగిలే నా ఖనిజపు కోటగా..
నీ వెంట వస్తుంటే..అది అడవైనా అదిరేనుగా..
నీ వంటు నాకుంటే.. నీ చిరునవ్వే నా హరివిల్లు గా..
వందేళ్లు ఉందాము..ఇలా ఊసులే శ్వాసగా..
అతడు:
ఏమి సోదరా మనసుకు ఏమైంది ఇలా
తేలిపోతున్నానా గాల్లో అలా
ఓరకంటితో చూస్తుంటే తనే ఇపుడిలా..
ఈ పయనం కలకాలం సాగిపోవాలి నీతో జతగా..
ఆ నీలి మేఘాలు ఆ సప్త వర్ణాలు ఆ సంద్ర కెరటాలు
ఒకటై ఇలా ఆరారు కాలాలు ఏడడుగులు
నీతోనే నడిచే వరమే ఇచ్చాయి గా..